ప్రమాద బీమా చెక్కు అందజేత

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 08 :సుల్తానాబాద్ మండలం బొంత కుంటపల్లి గ్రామానికి చెందిన TRS పార్టీ కార్యకర్త లంక కొండయ్య ప్రమాదవశాత్తూ ఇటీవల మరణించాడు. పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కును పెద్దపల్లి MLA దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా మృతుని భార్య భాగ్యమ్మకు అందజేశారు. రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, MPP బాలాజీ రావు, పురం ప్రేమ్ చందర్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ ఉన్నారు.