మహా వెలుగు, ప్రతినిధి: మహబూబాబాద్ 8.మహబూబాబాద్ జిల్లా కేంద్రం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల సాధనకై రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దాం LHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడా లక్ష్మన్ నాయక్ సారధ్యంలో నాలుగో రోజు జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ఆరు శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం శోచనీయమని తక్షణమే 10 శాతం రిజర్వేషన్ పెంచాలని అన్నారు.
రాజ్యాంగ బద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రాజ్యాంగ ఇచ్చిన హక్కు అని, దీనిని ఆపే హక్కు ఎవరికీ లేదని, తక్షణమే 10 శాతం రిజర్వేషన్ అమలు చేసి తెలంగాణలో ఉన్న లంబాడి గిరిజనుల అభివృద్ధికి సహకరించాలని ఆయన అన్నారు.
ఈ రిలే దీక్షల శిబిరం లో గిరిజన ఐక్య వేదిక నాయకులు భీమానాయక్, బొడ రమేష్ వీరన్న, రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
