గోదావరిఖని చౌరస్తాలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయండి : ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ


మహా వెలుగు రామగుండo ఏప్రిల్ 08: మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుకి శుక్రవారం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో బస్సు షెల్టర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, విద్యార్థుల పరీక్షలు, యువత పోటీ పరీక్షల దృశ్య బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు, యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కార్పొరేషన్ కార్యదర్శి ఈర్ల రామచందర్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ అన్నారు. ఆర్టీసీ సహకారంతో వెంటనే ఇక్కడ బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపైన స్పందించిన కమిషనర్ రెండు మూడు రోజుల్లో బస్సు షెల్టర్లును ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేయిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరుగుగురాళ్ల కళ్యాణ్, గణేష్ పాల్గొన్నారు.