మహా వెలుగు, ప్రతినిధి ,మహాబూబాబాద్ జిల్లా 8 : మహబూబాబాద్ జిల్లా పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారులు, చట్ట విరుద్ధమైన చిట్టి వ్యాపారుల మరియు చిట్ ఫండ్స్ వారి ఆగడాలు శృతి మించడంతో వారి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడానికి మహాబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు దాడులు నిర్వహించారు.
వడ్డీవ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తూ, ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్నారని ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు.
మరికొంతమంది అక్రమ చిట్టీలు నడిపిస్తూ, రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ వారు కూడా చిట్టి డబ్బులు అన్ని నెలలు పూర్తిగా చెల్లించి చిట్టి ఎత్తుకున్నా, వారికి చిట్టి డబ్బులు చెల్లించకుండా రకరకాల సాకులు చెబుతూ.. వెరిఫికేషన్ చెయ్యాలని నెలల తరబడివారికి డబ్బులు సకాలంలో చెల్లించకుండా వేదిస్తున్న సంఘటనలు పోలీసు వారి దృష్టికి వస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇటువంటి అక్రమ కార్యకలాపాలతో ఎంతోమంది ఉసురు తీసుకుంటున్న ఈవడ్డీ వ్యాపారులు మరియు రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ మరియు చట్ట విరుద్ధమైన చిట్టి యజమానుల పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
అందులో బాగంగానే జిల్లావ్యాప్తంగా 22 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఏకకాలంలో ముప్పేట దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.
వీరి అందరిపై తెలంగాణా మనీ లెండర్స్ ఆక్ట్- 1349 లోని వివిధ సెక్షన్స్ క్రింది మరియు చీటింగ్ సెక్షన్ 420 IPC క్రింద చట్ట రీత్య తగు చర్య తీసుకోబడుతుందని ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు.
ఈ మొత్తం సోదాలలో స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు…
1) నగదు 52,02,740 /-
2) ప్రోమిసరి నోట్స్ 395,
3] లాంగ్ బుక్స్ – 97
4) స్మాల్ చిట్ బుక్స్ – 664
5) ల్యాండ్ డాకుమెంట్స్ –16
6) బ్లాంక్ చెక్స్ –51
7) బ్యాంకు పాస్స్ బుక్స్ –07
8) చెక్ బుక్ -01
9] ATMs – 13 స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్ లో పాల్గొన్న 7 గురు సిఐ లు, 15 మంది ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.. వారితోపాటు, వారిని గైడ్ చేసిన అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్ ని ప్రత్యేకంగా ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.
