నిరుద్యోగ యువతీ యువకులకు “బాల్క ఫౌండేషన్” అండ

మహా వెలుగు, చెన్నూర్ : త్వరలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించనున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్ లో మరియు మందమర్రి పట్టణంలోని CER క్లబ్ లో రెండు ఉచిత కోచింగ్ సెంటర్లలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ ఉచిత కోచింగ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3,గ్రూప్-4,డిఎస్సి, టెట్, SI, కానిస్టేబుల్ మరియు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ అందించబడుతుందని వారు స్పష్టం చేశారు.

ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఉచిత కోచింగ్ సెంటర్లకు ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ మరియు మండలం, కోటపల్లి మండలం, భీమారం మండలం, జైపూర్ మండలాల యువతీ యువకులు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ, మందమర్రి మున్సిపాలిటీ & మండలం, జైపూర్ మండల యువతీ యువకులు క్యాతనపల్లి లోని ఎమ్మెల్యే స్వగృహంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే యువతీ యువకులు వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ , ఒక పాస్ ఫోటో తో సంప్రదించగలరని వారు తెలిపారు. కోచింగ్ సెంటర్ కి వచ్చే యువతీ యువకులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు నోట్ బుక్స్ మరియు స్టడీ మెటీరియల్ కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉచితంగా అందిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం విప్ సుమన్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ కమిటీ స్థలాన్ని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోచింగ్ సెంటర్ ఏర్పాట్ల పనులకు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.