రేపు విద్యుత్ అంతరాయం

132 KV మంథని-చెన్నూర్ లైన్ మరమ్మతుల కారణంగా శనివారం కిష్టంపేట 132 KV సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుంది. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.