నేను కూడా ఇక్కడి వాడినే , మీ వాన్నే ఇక్కడే నాకు తోట ఉన్నది

మన-ఊరు- మన బడి కార్యక్రమంలో : బాల్క సుమన్

మహా వెలుగు,భీమారo : నేను ఇక్కడి వాడినే ,మీ వాన్నీ , నా పామ్ ఆయిల్ తోట ఇక్కడే ,ఈ గ్రామ పంచాయతీ ప్రజల మధ్యలోనే ఉన్నదని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

భీమారo మండలం లోని పోల౦పల్లి గ్రామ పంచాయతీలో మన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా రూ.5 లక్ష ల 80 వేల  తో స్కూల్ డెవలప్మెంట్ పనులకు స్థానిక సర్పంచ్ దర్శనాల రమేష్ , ZPTC భూక్య తిరుమల నాయక్ , TRS  మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ…నేషనల్ హైవే నుండి గ్రామ పంచాయతీ కేంద్రం వరకు చెరువు కట్ట వెడల్పు రోడ్డు నిర్మాణం చేపట్టి సౌకర్యవంతoగా చేస్తానని హామీ ఇచ్చారు.  ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా చేస్తానని తెలిపారు. పొలంపల్లి తాళ్లగూడెం దర్గా వద్ద రూ.30 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ , మరో రూ.80 లక్షల తో అభివృద్ధి పనులు చేస్తానని , గ్రామ పంచాయతీ కేంద్రం నుండి ఆమ్లెట్ గ్రామాలైన అంకుశపూర్ , తాళ్ల గూడెం కు లింక్ రోడ్డు ఏర్పాటు కు కృషి చేస్తానని రానున్న మూడు సంవత్సరాల్లో పనులు సైతం పూర్తి చేస్తానన్నారు.

200 కుటుంబాలకు డబుల్  బెడ్రూమ్ పథకం కింద ఇండ్ల సహాయం ,50మందికి దళిత బంధు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. పోలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకుసాపూర్ తాళ్లగూడెం పోలంపల్లి గ్రామాలలో అన్ని వార్డులలో సీసీ రోడ్స్ సైడ్రెన్ కోసం రూ.80 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నాయకులు వడ్ల కొండ కిష్టయ్య , బొల్లం శ్రీనివాస్ ,ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.