196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కె. శశాంక.

చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యం …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహవెలుగు ప్రతినిధి,మహబూబాబాద్, ఏప్రిల్ -11: చదువుతో నే జీవితంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం స్థానిక ఐ.ఎం. ఏ. హాలులో మహాత్మా జ్యోతి భా పూలే 196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి జ్యోతి భా పూలే ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 1827 సంవత్సరంలో జ్యోతి భా పూలే జన్మించారని, 1800 శతాబ్దంలో జన్మించిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే వారు చేసిన కార్యక్రమాలు, కృషిని, స్ఫూర్తి ఎంత గొప్పవో ఆలోచించాలని, ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తి పొంది అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఆ మహనీయుని స్ఫూర్తిని కొనసాగించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని తెలిపారు.

ఆడపిల్లలు చదవాలని ఆనాడే సంకల్పించి విద్య యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పిన దంపతులు అని, బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారని, వితంతు పునర్వివాహ గురించి పూలే ప్రజల్లో చైతన్యం కలిగించి వివాహాలు జరిపించారని, బాధ్యత ఉన్న పౌరుడిగా సామాజిక చైతన్యం తీసుకురావడానికి కృషి చేసిన మహనీయులు అని తెలిపారు. వారు చేసిన కృషిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలిపారు.

చదువు ప్రాముఖ్యతను గుర్తించిన పూలే స్ఫూర్తిని కొనసాగిస్తూ బి.సి. గురుకులాలను ఏర్పాటు చేసి బి.సి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, మిగతా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన పరిస్థితిలో ఉన్నామని గుర్తించాలని గురుకుల విద్యార్థులకు తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో, ప్రతి అంశంలో నైపుణ్యం ప్రదర్శించి ఉత్తములుగా ఉండాలని, ఉత్తమ ప్రతిభ ఉన్న వారు మంచి అవకాశాలను అందిపుచ్చుుకుంటారని తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను, స్కాలర్షిప్ లను పొంది జీవితంలో మంచిగా చదివి పోటీ ప్రపంచంలో రాణించి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగాలని సూచించారు. మనది మారుమూల జిల్లాతో పాటు, వెనకబడిన జాతులు, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా అని, 10 వ తరగతిలో 5 వేల మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని, పదవ తరగతి తర్వాత చదువు ఆపకుండా, వీరందరూ డిగ్రీ, పి.జి. స్థాయి వరకు చదువు పూర్తి చేసుకునే విధంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా సంఘ నాయకులు, అధికారుల్ని కోరారు. చదువు తోనే జీవితంలో మార్పు సాధ్యమని తెలిపారు. కార్యక్రమానికి ముందు సమాచార శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ సారథి కళాకారులు పాటలు పాడారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా వెనకబడిన తరగతుల అభివృధి అధికారి ఎం. నరసింహ స్వామీ, వెనకబడిన తరగతుల సంక్షేమ నాయకులు వేణు, సంచార జాతుల, దళిత, గిరిజన, మైనార్టీ కులాలకు చెందిన ప్రతినిధులు, జిల్లా అధికారులు, జ్యోతి భా పూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.