నిషేదిత పొగాకు ఉత్పత్తుల పై ఉక్కుపాదం మోపిన : అఖిల్ మహాజన్ ఐపిఎస్

  • విలువ సుమారు రూ. 6,50,000
  • తనిఖీ లో స్వయంగా పాల్గొన్న మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్

మహా వెలుగు,మంచిర్యాల 11 :రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి సున్నం బట్టి వాడ లో ఒక ఇంటి ఆవరణలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు నిల్వ చేసి రహస్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్, మంచిర్యాల ఎస్ఐ గంగారాం, సిబ్బంది కలిసి ఆ ఇంటి ఆవరణలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి సుమారు రూ: 6,50,000/- రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత (V-1 టోబాకో) పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్కడ నిల్వ చేయడానికి సునీల్ శర్మ అనే వ్యక్తి రూమ్ అద్దెకు తీసుకోని గోదాం ల ఉపయోగిస్తున్నాడు. ఇంటిలో స్వాధీనం చేసుకున్న నిషేధిత పొగాకు ఉత్పత్తులను తదుపరి విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారికి అప్పగించడం జరుగుతుందని ఇంచార్జి డీసీపీ తెలిపారు.

ఈ సందర్భంగా మంచిర్యాల ఇంచార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యం,ప్రాణాలకు హాని కలిగించే గంజాయి, మాదకద్రవ్యాలు, గుట్కా, వంటి వాటిని అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను రహస్యంగా నిల్వ చేసి అమ్మడం, సరఫరా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుని వివరాలు ప్రవేశ పెట్టారు. సునీల్ శర్మ స్వరూప్ శర్మ. వ్యాపారం, కిరాణం, శ్రీనివాస టాకీస్ దగ్గర, గోసేవా మండల్, మంచిర్యాల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు