భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త.! తాళం వేసి ఉన్న గదిలో మృతదేహం.

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 12 : కట్టుకున్న భార్యని అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్
లో చోటుచేసుకుంది. ఓదెల గ్రామానికి చెందిన సూత్రాల రక్షిత 6 సంవత్సరాల క్రితం సుందరగిరి రాజేష్ ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో రక్షితకు పెట్టిన బంగారాన్ని నాలుగు సంవత్సరాల క్రితమే తాకట్టు పెట్టాడు. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాకట్టు పెట్టిన బంగారం విషయంపై భర్త రాజేష్ భార్య నిలదీయడంతో తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మినట్లు చెప్పడంతో వారి మధ్య ఘర్షణ జరిగి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్య రెండు రోజుల క్రితమే జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, ఎన్టీపీసీ సీఐ లక్ష్మీనారాయణ తో పాటు ఎన్టలు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.