మహా వెలుగు ప్రతినిధి: మహబూబాబాద్, ఏప్రిల్ – 13:ఆహార భద్రత చట్టం పగడ్బందీగా అమలు చేయాలని ఆహార భద్రత కమిషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశం మందిరంలో కమిషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి ఆహార భద్రత చట్టం అమలు తీరు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ….ప్రజాపంపిణీ వ్యవస్థ , ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం, కెసిఆర్ కిట్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ఏప్రిల్ 12న పరిశీలన చేయడం జరిగిందని, లబ్ధిదారులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి అని సూచించారు. చట్టము పకడ్బందీగా అమలు చేయడం లో ప్రజాప్రతినిధులను, ఎన్.జి. ఓ ల సమన్వయంతో వారి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, ఆహార భద్రత చట్టం అమలు లో జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటు పకడ్బందీగా అమలు చేస్తున్నామని, విజిలెన్స్ కమిటీ నీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, నెలవారీగా సమీక్షలు నిర్వహించుకొంటూ, జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించి అంగన్వాడీ సెంటర్లలో, చౌక ధరల దుకాణాల లో కార్డ్ బోర్డులను, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ పారదర్శకతను పాటిస్తూ ప్రతి గడప, గడపకు జవాబుదారీతనంతో సేవలను అందించి ఆశించిన మేరకు ప్రగతి సాధిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, డి.అర్.డి. ఓ. సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ రమాదేవి, DWO స్వర్ణలత లెనీన, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, డి.ఎస్. ఓ. నర్సింగరావు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, ఎన్.జీ.ఓ. ప్రతినిధులు, జిల్లా,మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
