మహా వెలుగు ప్రతినిధి, మహబూబాబాద్ 13 : మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు డిమాండ్ చేశారు.
బుధవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూ నియన్(సి ఐ టి యు అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబాబాద్ పట్టణం లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా యూనియన్ కార్యదర్శి కాం పెళ్లి శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఆకుల రాజు మాట్లాడుతూ..
రాష్ట్రంలో రెండు గ్రేటర్ మున్సిపాల్టీలు, 11 కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 64,000 పైగా ఉన్న మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మరియు కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. వారి సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే కాలంలో దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపరు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కే నాగన్న మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపాల్టీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ ఫిక్సిడ్ పే ,ఇంజనీరింగ్ విభాగం బిల్ కలెక్టర్ గా ఆఫీసులో పనిచేస్తున్న వివిధ కేటగిరీల్లో అందరికీ కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు పార్నది కృష్ణ ,కాయితం శీను, పోతరాజు వీరన్న, వెంగళరావు, దూపాటి శ్రీనివాస్, డి మధుసూదన్, కే శ్రీను సిఐటియు నాయకులు తోట శ్రీనివాస్, దుర్గా రావు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
