చెప్పుకునేది ఎలక్ట్రిషన్…. చేసేది దొంగతనం

  • మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్
  • 9 బైకులు స్వాధీనం వాటి విలువ నాలుగు లక్షలు

ఓ ఎలక్ట్రిషన్ దొంగగా మారాడు తనకు వచ్చిన పనిని మంచి దానికి కాకుండా చెడు కోసం ఉపయోగించాడు. తదనంతరం కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే……

కోటపల్లి మండలం మల్లం పేట గ్రామానికి చెందిన కోటరవి ఎలక్ట్రీషియన్ గా పని చేసేవాడు. తనకు వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేసేవాడు. డబ్బులు సరిపోకపోవడంతో ఐదు నెలలుగా మంచిర్యాల, కాసిపేట, హాజీపూర్ ,మందమర్రి ,ఏరియాలో బైకులను దొంగలించి కొని వాటిని కుదవ పెట్టి డబ్బులతో జల్సాలు చేసేవాడు… మోటార్ సైకిళ్లకు ఉన్న వైర్లను కలిపి వాటిని తీసుకెళ్లేవాడు. ఇలా మంచిర్యాల్ లోని హమాలివాడలో దొంగలించిన మోటార్ సైకిల్ పైన తిరుగుతూ…. పార్క్ చేసిన మోటార్ సైకిల్ కోసం తిరుగుతూ … మంచిర్యాల ఐబి లో పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు తనను ఎంక్వైరీ చేయగా 9 వాహనాలను దొంగిలించినట్లు నిందితుడు తమ తప్పును ఒప్పుకున్నాడు.

ఈ మేరకు బుధవారం విలేకర్ల సమావేశంలో మంచిర్యాల ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు.. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మంచిర్యాల్ లోని ఐబి ఏరియాలో నిందితుడు కోట రవి పట్టుబడినట్లు వారు తెలిపారు. హ్యాండిల్ లాక్ చేయకుండా ఉన్న మోటార్ సైకిల్ వైర్ లను కలిపి దొంగలించి అమ్ముకునే వాడని వారు తెలిపారు. ప్రజలు రోడ్డుపైన ఇంటి ముందు పరిసర ప్రాంతాల్లో వాహనాలు మార్పు చేసేటప్పుడు హ్యాండిల్ లాక్ తప్పకుండా చేసుకోవాలని వారు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుని పట్టుకొని అతని వద్ద చోరీ సొత్తును రికవరీ చేసిన పట్టణ సీఐబి నారాయణ నాయక్ సీసీఎస్ సీఐ డి. మోహన్ ఎస్ఐ గంగారాం సీసీఎస్ ఎస్ఐ డి. మహేందర్ హెడ్ కానిస్టేబుల్ దివాకర్ ,కానిస్టేబుల్ సతీష్, కే శ్రీనివాస్ సునీల్ వి. శ్రీనివాసులు అభినందించి రివార్డులు అందజేశారు.

*.