రైతుల పాలిట దయామయుడు సీఎం కేసీఆర్

మహా వెలుగు, చెన్నూర్ : రైతుల పాలిట దయామయుడు సీఎం కేసీఆర్ అని కెసిఆర్ కు ఎల్లవేళలా రైతులు తోడుగా ఉంటారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ , మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ , జెడ్పిటిసి మోతె తిరుపతి , మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డ , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బైంసా ప్రభాకర్ రెడ్డి , కలగూర రాజ కుమార్ , అరవిందరావు , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య , వైస్ చైర్మన్ ఆర్నె సమ్మయ్య , ఎంపీపీ మంత్రి బాబు తదితరులు పాల్గొన్నారు.