దళితుడిని ధనికుడిని చేసే పథకం దళిత బంధు.

  • ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మహా వెలుగు,మంచిర్యాల 14 : దళితుడిని ధనికుడిని చేసే పథకం దళిత బందు అని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో దళిత బంధు పథకం ద్వారా పలువురి లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత , శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు , బెల్లంపల్లి శాసన సభ్యులు చిన్నం దుర్గయ్య , జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్ష్మి , ఎమ్మెల్సీ దండే విఠల్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ,జిల్లా కలెక్టర్ భారతి హొలీ కెరీతో కలిసి దళిత బంధు పథకం ద్వారా పలువురి లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

దళిత జాతి ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనగారిన వర్గాలకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తూ..కుల వివక్షను రూపుమాపుతూ..
దళిత జాతికి ఆర్థిక, సామాజిక మద్దతు అందిస్తూ..
దళిత జాతి స్వశక్తితో, ఆత్మగౌరవంతో జీవించాలనే మహా సంకల్పంతో..“తెలంగాణకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన” అంబేద్కర్ కేసీఆర్ కు దళిత సమాజం తరపున, మా తరపున ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు.

70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో బ్రతుకు కోసం, స్వేచ్ఛ కోసం, కూలి కోసం, మనుగడ కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడే జాతి ఏదైనా ఉంది అంటే అది ఒక దళిత జాతే..నాటికీ నేటికీ దళిత సమాజం అణచి వేయబడ్డతున్న ఈ సందర్భంలో..దళిత జాతిలో ఒక చైతన్యం నింపుతూ..వారి జీవితాల్లో బ్రతుకు సమరాన్ని నింపుతూ..యావత్ దళిత జాతిని కదిలించి నడిపించగల నాయకత్వం కోసం..దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో దళిత జాతి అభ్యున్నతి కోసం అభినవ అంబేద్కరుడై మన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ఏకంగా దళిత జాతి అస్తిత్వానికే తిరిగి ప్రాణం పోశారని ప్రభుత్వ విప్ సుమన్ స్పష్టం చేశారు.

స్వతంత్ర భారతావనిలో ఎన్నో పాలకవర్గాలు, గొప్ప గొప్ప నాయకులు అని ప్రగల్భాలు పలికిన రాజకీయ దురందురులు.. ఎంత మంది పాలించినా దళితులను ఓటు బ్యాంకుగా చూసి వారి కుతంత్రాలు, వ్యూహాలలో బలిపశువులను చేశారు , గానీ ఎన్నడూ వారి అభ్యున్నతి కోసం పాటుపడింది లేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు వెలుగులో ఊపిరి పోసుకున్న దళిత బంధు పథకం ద్వారా వారి జీవితాల్లో నేడు ప్రగతి వెలుగులు ప్రసరించనున్నాయని వారు తెలిపారు.సమానత్వ సాధన కోసం ,కులరహిత సమాజం కోసం, పరితపిస్తున్న దళిత సమాజం!!
వారి హక్కుల కోసం వారు పోరాడాలన్నా.. సమాజంలో తనదైన స్థానం సాధించుకోవాలన్నా ,
ఆర్థికంగా వారు ఎంతో ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి, అనేక పర్యాయాలు చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత చైతన్యానికి మార్గదర్శిగా నిలుస్తూ నేడు రాష్ట్రంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు. తరతరాలుగా తలవంచక బడి నిల్చున్న దళితుడు..
ధైర్యంగా ప్రశ్నించ గల సమిష్టి శక్తిగా సమకూరినప్పుడు..
వారి అవమానాలను దిగమింగి, అభివృద్ధి వైపు ప్రయాణించాలంటే, ఆర్థిక పరిపక్వత చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని ,దళితుల ఆర్థిక ఎదుగుదల, ఆత్మగౌరవం ఎదుగుదలే లక్ష్యంగా ప్రతి కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకునే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు. వారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా దళిత బంధు పథకం ద్వారా నాటి కూలీలే నేడు ఓనర్లు గా మారుతున్న సందర్భాలున్నాయన్నారు.

నేడు తెలంగాణలో బడుగు జాతికి నవోదయం మొదలైంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తూ రూ.10 లక్షల రూపాయలను అందించడం బహుశా ప్రపంచ చరిత్రలో తొలిసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎలాగైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ “ఆకలి చావుల నుండి అన్నపూర్ణగా వెలిగిందో” నేడు ఆయన చూపిన దళిత బంధు పథకం బాటతో రాష్ట్రంలోని దళితుల దరిద్రానికి చరమగీతం పాడి వారి జీవితాల్లో ప్రగతి వెలుగులు ప్రసరిస్తాయి అన్న నమ్మకం మాకు ఉందని , ఎప్పటిలాగే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న విశ్వాసం కూడా ఉందని తెలిపారు. దీనికి అదనంగా నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని అంటరాని తనం పేరుతో ఊరవతల వుంచి ఉత్పాదక రంగానికి దూరం చేయకూడదన్న ఉద్దేశంతో
ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు వంటి ఆర్థికాభివృద్ధి వుండే రంగాలను గుర్తించి వాటిలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయo అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ లబ్ధిదారుని భాగస్వామ్యంతో శాశ్వత ప్రాతిపదికన “దళిత రక్షణ నిధిని” ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి మరొక్కసారి ధన్యవాదాలు తెలిపారు.

దళిత బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరిన లబ్ధిదారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలోనే జిల్లాలో నియోజకవర్గానికి 1500 మందిని ఎంపిక చేసి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.