రామగుండంలో యువకుడి ఆత్మహత్య

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 16 : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ కు చెందిన అజ్మీర భాస్కర్ (35) అనే యువకుడు శనివారం తెల్లవారుజామున క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.