మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 16: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 2ఏ గని బొగ్గుగని పై శనివారం బోగే సతీష్ , ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నిరాహారదీక్షలు చేపట్టారు. సింగరేణి కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని కార్మికుల న్యాయమైన డిమాండ్లతో పాటు సురక్షిత మంచినీటి ని అందించాలని నిరాహార దీక్ష చేసారు.
