చెన్నూర్ లో కృతజ్ఞత సభ రైతులు తరలిరావాలే : ప్రభుత్వ విప్ సుమన్

మహా వెలుగు, చెన్నూర్ 16 : చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1.658 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసేoదుకు చెన్నూర్ పట్టణంలో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈనెల 18 చెన్నూరు పాత వ్యవసాయ మార్కెట్ లో నిర్వహించే కృతజ్ఞత సభకు నియోజకవర్గంలోని రైతాంగం పెద్ద ఎత్తున తరలిరావాలని వారు తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంతేకాక సా
తాగునీరు అందుతుందని దీంతో చెన్నూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని సుమన్ తెలిపారు. ఈ కృతజ్ఞత సభకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వారు సూచించారు. నియోజకవర్గం లోని రైతులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని రైతులను కోరారు.