రహదారులు అద్దంలా మెరవాలి

మహా వెలుగు హైదరాబాద్ 16 : రహదారులు మొత్తం అద్దంలా , మెరువలని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇందులో భాగంగా శనివారం హైదరాబాదు లోని R&B కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలతో పాటు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఇందులో భాగంగా

చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ రహదారికి సంబంధించి గోదావరి నది బ్రిడ్జి నుండి ఇందారం క్రాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, మొక్కలు నాటడం, బ్యూటిఫికేషన్… NH 63 పరిధిలోని ఇందారం క్రాస్ రోడ్ నుండి అర్జున గుట్ట వరకు జైపూర్, భీమారం మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల వెడల్పు, సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి.

భీమారం నుండి ఆవడం రోడ్ నూతనంగా నిర్మిస్తున్న పనులు వేగవంతం చేయాలని సూచించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్ నుండి గాంధారివనం వరకు రూ.15 కోట్ల నూతనంగా రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, నూతన జంక్షన్ల ఏర్పాటు, డివైడర్ లో తదితర అంశాలపై అధికారులతో కూలంకషంగా మాట్లాడారు. ఈ సమావేశంలో R&B CE, SE మరియు ఏజన్సీ వారు పాల్గొన్నారు.