మహా వెలుగు ప్రతినిధి, కపిల్ కుమార్ ,వలేపల్లి
మహా వెలుగు ప్రతినిధి,మహబూబాబాద్ 16. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండలంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో మావోయిస్టుల పేర్లతో ఉమామహేశ్వరరావు మరియు వేరొక సాధారణ వ్యాపారులను బెదిరించి 10 నుంచి 15 లక్షలు డబ్బులు అయినా ఇవ్వండి లేదా కొత్త కార్లను కొని ఇవ్వండి అంటూ సదరు వ్యక్తులను బెదిరించడం జరిగింది. భయాందోళనతో ఒక్కసారిగా మన్యం ఉలిక్కిపడింది.
సదరు వ్యాపారులు భయం భయం తో మండల కేంద్రానికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని ఎస్సై రమాదేవి తెలిపారు. విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలియజేశారు.
