జిల్లా పోలీస్ శాఖ నుండి మెగా జాబ్ మేళా


కపిల్ కుమార్. వల్లేపల్లి

మహా వెలుగు ప్రతినిధి,మహబూబాబాద్/ తొర్రూర్ .16

పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చునని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శనివారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్యభట్ట కాన్సెప్ట్ను స్కూల్లో జిల్లా పోలీసు షాక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ .పట్టుదల ఉంటే ఎంతటి గమ్యాన్ని అయినా చేరవచ్చునని, మొదటగా కష్టపడితే అవకాశాలు వస్తూనే ఉంటాయని భవిష్యత్తులో ఎదగడానికి పునాది మనకు మనమే ఏర్పాటు చేసుకోవాలని, ఇలాంటి గొప్ప అవకాశాలు తక్కువగా వస్తాయని వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల ఆశయాలు నమ్మకాన్ని నిలబెట్టాలని, అన్నారు.

గతంలో1000 మంది తొర్రూరు నుండి,1500 పాలకుర్తి నుండి జాబ్ మేళా లో ఎంపిక కాగా 50శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారని, కష్టపడే గుణం ఉంటే జాబ్ ఎక్కడైనా చేయవచ్చునని అంచెలంచెలుగా మనసు మనుగడ మొదలవుతుందని, ఇప్పటి వరకు లక్ష 30 వేల జాబ్స్ రాష్ట్రంలో ఇచ్చామని, 80 వేల ఉద్యోగాలకు నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని, తొర్రూర్ లో 3నెలల పాటు 2 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ క్యాంపు నిర్వహించబోతున్న ట్లు మంత్రి తెలిపారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని 7 వేల కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు విధుల్లో ఏకాగ్రత ముఖ్యమని పనితనం మెరుగుపరుచుకునే మరింత వేతనాలు అవకాశాలు పొందవచ్చునని మంత్రి తెలిపారు. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయని వరంగల్ లోని టెక్స్టైల్ పార్క్ లో 1 లక్ష ఉద్యోగాలు కల్పించి తెలంగాణకు తలమానికంగా అవకాశాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. నిరుద్యోగుల కోసం నెల రోజుల పాటు కృషి చేసి ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎస్పీ మరియు పోలీస్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా గిరిజన వెనుకబడిన ప్రాంతం లో ఇలాంటి జాబ్ మేళా లు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరమని ఈరోజు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో 1570 మంది పాల్గొన్నారని, సుమారు 1000 మంది ఉద్యోగం పొందారని, రానివారు నిరుత్సాహ పడవద్దు అని ఇంకా గొప్ప అవకాశాలు రాబోతున్నాయని, పది రోజుల నుండి ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నుంచి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు చైతన్య గీతాలు పాడి అలరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్, డి.ఎస్.పి వెంకటరమణ, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, కోఆర్డినేటర్ కాసర్ల రవితేజ, సీఐలు, ఎస్సైలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.