క్రీడా, సాంస్కృతిక పోటీల నిర్వహణకు ప్రత్యేక కమిటీ


మహ వెలుగు ప్రతినిధి,: కపిల్ కుమార్ ,వల్లేపల్లి
మహబూబాబాద్ 17 : జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కే శశాంక అన్నారు.

ఆదివారం ఉదయం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో క్రీడా, సాంస్కృతిక పోటీల నిర్వహణ ప్రత్యేక కమిటీ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ , టగ్ ఆఫ్ వార్, & సాంస్కృతిక మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీల నిర్వహణ బాధ్యతలు పురుషుల నుండి అడిషనల్ కలెక్టర్ లు (రెవెన్యూ) డేవిడ్, మహిళా విభాగం నుండి (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ లకు ఈ నెల 18 వ తారీకు నుండి 21 తారీకు సాయంత్రంలోగా శాఖల వారీగా తమ పేర్లను నమోదు చేసుకుని అధికారి ద్వారా అడిషనల్ కలెక్టర్లకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.22వ తేదీ నుండి 25వ తేదీ వరకు 4 రోజులపాటు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలకు డి వై ఎస్ ఓ గారి 9290010949 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

     ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో రమేష్ , క్రీడా సాంస్కృతిక పోటీలు కన్వీనర్ డి ఆర్ డి ఓ సన్యాయ్య, జిల్లా క్రీడా అధికారి అనిల్, డి హెచ్ ఎస్ ఓ సూర్యనారాయణ, జిల్లా అధికారులు దిలీప్ కుమార్, డి పి ఓ సాయి బాబా, సుధాకర్, అగ్రికల్చర్ ఎం ఏ ఓ రాంజీ తదితరులు పాల్గొన్నారు.