ఆరోగ్య మేళా ప్రారంభo

మహా వెలుగు , ప్రతినిధి : కపిల్ కుమార్ వల్లేపల్లి తొర్రూరు/మహబూబాబాద్ జిల్లా, ఏప్రిల్ -18 : తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి త్రాగునీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ కె.శశాంక లు ప్రారంభించారు.

ఆరోగ్య మేళాలో ఏర్పాటు చేసిన 11 స్టాల్స్ ను సందర్శించి అందిస్తున్న పూర్తి వైద్య వివరాలు, వాటి ప్రత్యేకతలు డాక్టర్లను అడిగి తెలుసుకొని నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి వైద్య అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. …. ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా నిర్వహిస్తున్నట్లు, ఈ మేళాలో భాగంగా మధుమేహం, రక్తపోటు, క్షయ, కంటి, చెవి, ముక్కు, గొంతు పరీక్షలు, దంత, చర్మ సంబంధిత వ్యాధులకు, కుష్టు, మలేరియా, అంధత్వ నివారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, పొగాకు వినియోగం దుష్ఫలితాలు, అంధత్వ నివారణ పై అవగాహన కల్పిoచనున్నట్లు తెలిపారు. ఉచితంగా మందులు అందజేయనున్నట్లు,మెగా క్యాంప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి శాశ్వత హెల్త్ కార్డు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ వైద్య శిబిరానికి ప్రత్యేక వైద్య నిపుణులు రావడం జరిగిందని, క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలను కష్టకాలంలో వైద్యపరంగా ఆదుకోవాలనే లక్ష్యంతో మెగా క్యాంపు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు 11 వందల కోట్లతో వరంగల్ లో ఆస్పత్రి నిర్మించబోతున్నట్లు, మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణాలు పూర్తి దశలో ఉన్నట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తొర్రూరు వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని, 25 లక్షలతో ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా అంబులెన్స్ ను అందించడం జరిగిందని, కొంతమేర కరోనా భారం తగ్గిందని నూటికి నూరు శాతం ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేట్లు వైద్య అధికారులు చొరవ తీసుకోవాలని, కెసిఆర్ కిట్టు, అమ్మాయి పుడితే రూ.13000 వేలు అబ్బాయి పుడితే రూ.12000 ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం మనదని, పుట్టిన బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, సిజేరియన్ సు అరికట్టాలని రాష్ట్రంలో అంతమైన ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుకోవాలని వారు తెలిపారు.

57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పది రోజుల్లో నూతన పెన్షన్ లు అందించబోతున్నట్లు, నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ప్రతి గడపకు మిషన్ భగీరథ ద్వారా 40 వేల కోట్లతో స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామని, 24 గంటల నిజమైన కరెంటు, నిండుకుండలా చెరువులతో మిషన్ కాకతీయ లాంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని 70 యేండ్ల ల్లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన కెసిఆర్ ప్రభుత్వానిదే ఈ ఘనత అన్నారు. వైద్య విద్యారంగానికి ప్రాముఖ్యత కల్పిస్తుందని మంత్రి దయాకర్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ…. జిల్లాలో 4 మెగా హెల్త్ క్యాంపులను తొర్రూర్, కొత్తగూడ, తీగల వేణి, నర్సింహులపేటల్లోనిర్వహించబోతున్నట్లు,మెగా క్యాంపు ప్రధాన ఉద్దేశం ఆరోగ్య సమస్యల కార్యక్రమాలపై అవగాహన కల్పించి హెల్త్ కార్డు జారీ చేయడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో వైద్యానికి ప్రాముఖ్యత కల్పిస్తుందని, సబ్ సెంటర్ లో సొంత భవనాలు ఉండేట్లు తగు చర్యలు తీసుకుంటున్నట్లు, ఏఎన్ఎం ఆశాలు నూరు శాతం గ్రామాల్లో ఉండి సేవలు అందించాలని,100% కరోనా వాక్సినేషన్ పూర్తి చేసుకొని, జిల్లాలో బూస్టర్ డోస్ పూర్తి చేసుకున్నామని, ప్రతి ఇంటికి అందించాల్సిన వైద్యంపై డాక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలని,21 ఆరోగ్య కేంద్రాలు, 173 సబ్ సెంటర్లు, ఉండగా 74 నూతన సబ్ సెంటర్ లను మంజూరు చేసుకోవడం జరిగిందని 7 పూర్తయ్యాయని, పల్లె ధవాఖాన ల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని 66 ఏఎన్ఎం నూతన గా నియమించుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్, ఆర్డిఓ రమేష్, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ వో మురళీధర్, ప్రత్యేక వైద్య నిపుణులు, మెడికల్ ఆఫీసర్లు, సాంగ్ మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య ,జడ్పీటీసీలు శ్రీనివాస్ జ్యోతిర్మయి ,ఎంపీపీ రాజేశ్వరి, తాసిల్దార్ రాఘవరెడ్డి ఎంపీడీవో కుమార్, ప్యాక్స్ చైర్మన్ హరి ప్రసాద్, చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ నాగ వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ శాంత, డాక్టర్లు, సూపర్వైజర్లు ,ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

.