నకిలీ విత్తనాల కట్టడికి ఆన్ లైన్ పర్యవేక్షణ

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 18 : రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్ విధానాన్ని అమలు చేయనున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 300 మంది డీలర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ-పాస్ యంత్రాలతో ఎరువులు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం విత్తనాల విషయంలో ఎక్కడి నుండి తీసుకువచ్చారు..? విక్రయాలు ఎంత చేశారు..? అనే విషయాలను సెల్ ఫోన్, లాప్ టాప్ ల ద్వారా నమోదు చేయాల్సి ఉంది. దీంతో రైతన్నలు కొంతవరకు ఊరట చెందుతున్నారు.