కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు…

కపిల్ కుమార్ వల్లేపల్లి , మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్, ఏప్రిల్ -18: ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసుకొని నూతనoగా 330 పడకలు నిర్మించుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్ లు అన్నారు.

సోమవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 36 పడకల గదుల భవనాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, త్రాగునీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సోషల్ రెస్పాన్సిబిలిటీగా CSR నిధుల కింద అమెరికా వెల్స్ ఫార్గో, యునైటెడ్ వే స్వచ్ఛంద సంస్థ వారు 70 లక్షలు అందజేశి 36 పడకల గదులను నిర్మించినందునకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ కార్పోరేట్ ఆస్పత్రులకు తగ్గట్టుగా ఏ మాత్రం తీసిపోకుండా వైద్యం అందించడమే జిల్లా ప్రధాన ఆసుపత్రి లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నందుకు అభినందనలని, నర్సింగ్ వైద్య కళాశాలలు నిర్మించుకోని ప్రారంభించుకో నున్నామనీ, ఏరియా ఆసుపత్రి ని జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసుకున్నామని, ప్రభుత్వ ఆస్పత్రిలోనే మాత శిశువులకు ప్రత్యేక విభాగం కేటాయించబో తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రు ల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా డాక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రo ఏర్పడ్డాక వినూత్నమైన, అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుందని, వైద్య, విద్యా రంగాలను అన్ని విధాలుగా ముందంజలో ఉండేట్లు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఎక్కువ ఆపరేషన్లు మహబూబాబాద్ లో అవుతున్నాయని, 100 కి 70 ఆపరేషన్లు చేస్తున్నారని, పూర్తి స్థాయిలో తగ్గాలని ఆపరేషన్లు చేస్తే తల్లి పాలకు బిడ్డ దూరం అవుతుందని, దీనివల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెంపొదదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, 36 పడకల భవనం ప్రారంభించుకోవడం మానుకోట బంగారు కోటగా మారుటకు సూచికగానే భావిస్తున్నానని అన్నారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో కూడా హైదరాబాద్ లో ఉండే వైద్య వసతులు అందుబాటులోకి వస్తున్నాయని, గిరిజనులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. టీ. డయాగ్నస్టిక్ కేంద్రం ప్రారంభం చేసుకుని అనేక విలువైన పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని, 300 ఆక్సిజన్ పడకలు అందుబాటులో కలవని, 30 ICU గదులను 4కోట్ల 70 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక, శాసనసభ సభ్యులు బానోతు శంకర్ నాయక్, ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, మున్సిపల్ చైర్ పర్సన్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, ఆసుపత్రి సూపర్డెంట్ వెంకట్ రాములు, వెల్స్ ఫార్గో ప్రతినిది భూషణ్ రెడ్డి, డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.