టిబిజికెఎస్ లో చేరికలు


మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 18: సోమవారం రామగుండం రీజియన్1 జిడికె 11ఇంక్లైన్లో గని ఫిట్ సెక్రెటరీ నాయిని శంకర్ ఆధ్వర్యంలో టిబిజికెఎస్ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ఉపాధ్యక్షులు గండ్ర దామోదర రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు బోయినపల్లి వెంకట్రావ్ హాజరై మాట్లాడారు.

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో టీబీజీకేఎస్ ఎప్పుడూ ముందుంటుందని జాతీయ సంఘాలు సాధించని వారసత్వ ఉద్యోగాలు కెసిఆర్ సింగరేణి కార్మికులపై ఎనలేని ప్రేమతో సాధించామని అన్నారు. ఇప్పటికే సుమారు 10వేల మంది యువ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా 150మంది కార్మికులు వివిధ డిపార్ట్మెంట్ ల నుండి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు.

టీబీజీకేఎస్ లో కండువా కప్పి ఆహ్వానిస్తున్న వెంకట్ రావు

ఈ కార్యక్రమంలో నాయకులు నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, కె సాంసన్, దేవ వెంకటేశం, ఎట్టం కృష్ణ, యాదవ రెడ్డి, కుషనపల్లి శంకర్, శేషగిరి, గంగాధర్, జాన్ కెనడీ, రమేష్ రెడ్డి, దాసరి నర్సయ్య, దొరగండ్ల మల్లయ్య, రాజిరెడ్డి, గండు శ్రావణ్, రాజేశంతో పాటు గని ఫిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ నాయకులు రమేష్, భాస్కర్, తిరుపతి, కుమార్, వెంకటేశ్వర్లు, వంశీ, దేవేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.