దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల, వాహనాల పంపిణీ కార్యక్రమం

కపిల్ కుమార్, వల్లేపల్లి మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్, ఏప్రిల్ -18: దళిత బంధుతో లబ్ధిదారులు ఆర్థిక పురోగతిని సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫర శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

సోమవారం మధ్యాహ్నం స్థానిక నందన గార్డెన్ లో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల, వాహనాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలొనే మొదటగా జిల్లాలో పంపిణీ చేయనైనది అని మంత్రి తెలిపారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క

జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 305 కుటుంబాల లబ్ధిదారులను ఎంపిక చేయగా, గ్రౌండింగ్ అయిన ఆస్తుల, వాహనాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 70 సం,రాల్లో జరగని అభివృద్ధి 7 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిన ఘనత కేసిఆర్ దేనని, ప్రతి ఒక్కరు విశ్లేషన చేసుకోవాలని, సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి గడపకు అందించే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుబంధు తో వారిని ఆదుకుంటుందని, కాలేశ్వరం జలాలతో సంవత్సరంలో రెండు దఫాల వ్యవసాయరంగానికి సాగు నీరు ఇస్తున్నమనీ, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, పాతాళ గంగను తలపించే విధంగా బోర్లు బావులు చెరువులు పొంగిపొర్లుతున్నాయన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా దశలవారీగా పథకాలను ప్రవేశపెడుతున్నామని, ఏ గ్రామంలో చూసినా దళితుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థికంగా వారు వెనుక బడ్డారనే సదుద్దేశంతో దేశంలోనే మొట్ట మొదట ప్రతిష్టాత్మకంగా దళిత బందును ప్రవేశ పెట్టడం జరిగిందని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 10 లక్షలు జమ చేస్తూ వారికి యూనిట్లను పంపిణీ చేసే బాధ్యత మాదే అన్నారు. దశల వారీగా దళితులను ఈ పథకంలో ఎంపిక చేస్తూ లబ్ది చేకూర్చ నున్నట్లు, 3 వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నియోజకవర్గాలకు పంపిణీ చేస్తున్నామని, సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించి 3 లక్షలు అందజేస్తామని, ప్రతి నియోజకవర్గంలో నుండి ఏడు వేల మందికి నూతన పెన్షన్ లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ గడ్డమీద పుట్టినందుకు గర్వపడాలని, వడ్లు కొంటే నష్టం వాటిల్లుతున్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ప్రణాళికాబద్ధంగా యూనిట్లను వినియోగించుకుని కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని, గ్రామాల్లో, మండలాల్లో ప్రజలకు ఏది అవసరమో అదే యూనిట్లను కొనుగోలు చేసుకుంటే నష్టపోకుండా వాటిని కాపాడుకుంటామని, రాష్ట్రంలో విద్య, వైద్యానికి, దళిత బంధు పైలెట్ ప్రోగ్రాలు గా మూడు పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్లు దళిత గిరిజన వాడల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, దళితుల కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తున్నామని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క

రాష్ట్ర స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దళిత పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కై దళిత బందును ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలతో యూనిట్లను కొనుగోలు చేసి 305 మంది లబ్ధిదారులకు ఆస్తుల పై హక్కులను కల్పించడం నిజంగా ఇంతకు మించిన శుభదినం మరొకటి లేదని, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లబ్ధిదారులకు యూనిట్లను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని అధికారులను అభినందిస్తున్నానని మంత్రి సత్యవతి తెలిపారు. నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం హాస్టల్ లో చదివే పిల్లలకు భోజనం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ అనేక ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరం రుణపడి ఉంటున్నామని 305 మంది దళిత బంధు లబ్ధిదారులకు 30.50 కోట్ల విలువైన యూనిట్లను అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, జిల్లాలో 305 మంది దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేసుకొని, గడప గడపకు వెళ్లి వల్ల బాగోగులు తెలుసుకొని యూనిట్ లను ఎంపికకు అవగాహన కల్పించామని తెలిపారు. వారి ఖాతాలకు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని, 216 ప్రాజెక్ట్స్ లను లబ్దిదారులు ఎంపిక చేసుకోగా, మంజూరు చేసుకోవడం జరిగిందని, ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి 50, పౌల్ట్రీ, డైరీ యూనిట్లకు సంబంధించి ఈ సభ ద్వారా 79 యూనిట్ లను గ్రౌండింగ్ చేసుకోవడం జరుగుతున్నది అన్నారు. మన కుటుంబాలు పడ్డ కష్టం మనం, మన పిల్లలు పడవద్దని దళిత బంధు యూనిట్ ద్వారా బలోపేతం కావాలని సూచించారు.

శాసనసభ సభ్యులు బానోతు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ, దనసరి సీతక్క,ఎం పి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, రావు, అడిషనల్ కలెక్టర్లు అభిలాష అభినవ్,డేవిడ్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, మున్సిపల్ చైర్ పర్సన్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆర్ డి వో లు కొమురయ్య రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల స్థాయి అధికారులు, లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.