రామగుండం లయన్స్ క్లబ్ అఫ్ మగువ అధ్యక్షురాలుగా మరోసారి సోమరాపు లావణ్య- అరుణ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

మహా వెలుగు , పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చందా చంద్ర కాంత్ 19 : లయన్స్ క్లబ్ అఫ్ రామగుండం మగువ అధ్యక్షురాలిగా సోమారపు లావణ్య – అరుణ్ కుమార్ మరోసారి ఏక గ్రీవంగా ఎన్నిక కాగా, సెక్రటరీ గా లయన్ Dr. లక్ష్మివాణి కూడా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా,లయన్ Er. బత్తుల తేజస్వి, మొదటి వైస్ ప్రెసిడెంట్ గా లయన్ Dr. వనజ రాపోలు, రెండవ వైస్ ప్రెసిడెంట్ గా గాలి సునీత, ఇతర విభాగాలలో Dr. సంక్షేమ రెడ్డి, పెంచల అర్చన, దీటి సుజాత తదితరులను ఏకగ్రీవంగా లయన్ సభ్యులు ఎన్నుకున్నారు కాగా రామగుండం లయన్స్ క్లబ్ అఫ్ మగువ నూతన కార్యవర్గం లో తమకు రెండవ సారి అవకాశం ఇచ్చిన లయన్ సభ్యులందరికి నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.