కపిల్ కుమార్.వి ,స్టాఫ్ రిపోర్టర్ మహ వెలుగు
మహబూబాబాద్, ఏప్రిల్ -20: అర్నవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదులో సేల్స్, టెలిమార్కెటింగ్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకై ఈ నెల 22 న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్.డి.ఎన్.వి.రామకృష్ణ నేడొక ప్రకటనలో తెలిపారు.

అర్హత, ఆసక్తి గల 18 నుండి 30 సంవత్సరాలు వయస్సు గల స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ నెల 22న ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించు జాబ్ మేళా కు హాజరు కావాలని తెలిపారు.
సేల్స్, టెలీ మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ పోస్టుకు ఇంటర్ ఆ పైన, బిజినెస్ డెవలప్మెంట్ ఎక్జిక్యూటివ్ పోస్టుకు డిగ్రీ ఆపైన అర్హత కలిగి ఉండి హైదరాబాద్ లో పని చేయుటకు ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు.
ఎంపిక కాబడిన వారికి జీతం 10 వేల నుండి 20 వేల వరకు ఇవ్వనున్నట్లు, మరిన్ని వివరాలకు హెచ్.ఆర్. సంస్థ శ్రీహర్ష సెల్ నంబర్ 6360734176 లో సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు.
