కపిల్ కుమార్.వి మహా వెలుగు : స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 20 : మహబూబాబాద్ జిల్లా
గూడూరు మండలం, గుండెకుడి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు ని ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతు ప్రజలు మెడికల్ క్యాంపు ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.క్యాంపు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ..

తెలంగాణ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై ఆరోగ్య పరంగా ప్రత్యేక దృష్టి సారిస్తుందని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని అన్నారు ..
ఈ కార్యక్రమంలో జడ్పీ కో- ఆప్షన్ సభ్యులు ఎండి ఖాసీం , DM&HO హరీష్ రాజ్ , వెంకటకృష్ణ రెడ్డి , నుకాల సురేందర్ ,వైద్యులు , మరియు వైద్య సిబ్బంది , తదితరులు ఉన్నారు ..
