రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 30 వరకు పొడిగింపు

మహా వెలుగు చెన్నూర్ 20 :చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతుల రిజిస్ట్రేషన్ ఈ నెల 30 వరకు పొడిగించినట్లు వారు తెలిపారు.

ఇందులో భాగంగా బుధవారం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్లలో ఏర్పాట్లను పరిశీలించడం విప్ పరిశీలించారు.

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించనున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్ లో మందమర్రి పట్టణంలోని సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ రెండు ఉచిత కోచింగ్ సెంటర్లలను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.

కేంద్రాన్ని పరిశీలిస్తున్న నౌకరి బాల్క సుమన్

ఈ ఉచిత కోచింగ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3,గ్రూప్-4,డిఎస్సి, SI, కానిస్టేబుల్ మరియు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్ అందించబడును. మే 1 నుండి ప్రారంభమయ్యే ఉచిత కోచింగ్ సెంటర్లకు ఆసక్తిగల యువతీ యువకులు ఈనెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

చెన్నూరు మున్సిపాలిటీ మండలం, కోటపల్లి మండలం, భీమారం మండలం, జైపూర్ మండలాల యువతీ , యువకులు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని
క్యాతనపల్లి మున్సిపాలిటీ, మందమర్రి మున్సిపాలిటీ & మండలం, జైపూర్ మండల యువతీ యువకులు క్యాతనపల్లి లోని ఎమ్మెల్యే స్వగృహంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్

రిజిస్ట్రేషన్ చేసుకునే యువతీ యువకులు వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ , ఒక పాస్ ఫోటో తో సంప్రదించగలరని తెలిపారు.కోచింగ్ సెంటర్ కి వచ్చే యువతీ యువకులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు ,నోట్ బుక్స్ , స్టడీ మెటీరియల్ కూడా ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉచితంగా అందించనున్నట్లు వారు తెలిపారు.

నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక ప్రకటనలో తెలియజేశారు