ఫస్ట్ నైట్ కి భయపడి సూసైడ్ చేసుకున్న నవ వరుడు

మహా వెలుగు ఆంధ్ర ప్రదేశ్ 20 కొన్ని సంఘటనలు ముక్కున వేలు వేసుకునే లాగా ఉంటయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.. ఈ సంఘటన సైతం అలంటిదే ఈ విచిత్ర సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగింది. మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడికి తెనాలికి చెందిన యువతితో ఈ నెల 11 న వివాహం జరిగింది. 12 వ తేదీన వధువును తీసుకొని వరుడు మాచర్లకు వెళ్ళిపోయాడు. నాలుగు రోజుల తర్వాత 16 వ తేదీన తెనాలిలో మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో భార్యను తీసుకొని మాచర్ల నుంచి

తెనాలికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరు బస్టాండుకు రాగానే ఇప్పుడే వస్తానని చెప్పి కనబడకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఎదురు చూసిన నూతన వధువు తన బంధువులకు సమాచారమిచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేది లేక, చీకటి పడుతుందని తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, కృష్ణా నది ఎగువన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందిన పోలీసులకు సమాచారం రావడంతో వారు శవాన్ని వెలికి తీశారు. జేబులో ఉన్న ఫోన్ సిమ్ తీసి బంధువులకు సమాచారమందించారు. మృతుడి తల్లి వచ్చి గుర్తు పట్టడంతో మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదటి రాత్రి అంటే తన కొడుకు భయపడ్డాడని, స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా ఆత్మహత్య చేసుకొని తమకు, నూతన భార్య కు అ న్యాయం చేశాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.