కేసీఆర్ పాలన పై విసిగి పోయిన తెలంగాణ ప్రజలు

మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ అనసూరి మంథని 21: కేసీఆర్ పాలన పై విసిగి పోయిన తెలంగాణ ప్రజలు ఉన్నారని ,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శ్రీధర్ బాబు సమక్షంలో తెరాసా పార్టీ నుండి తెరాస SC సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు భూపల్లి రాజు , తెరాస కాటరాం మండల అధికార ప్రతినిధి కుమ్మరి అశోక్, మహదేవ్ పూర్ తెరాస SC సెల్ మండల అధ్యక్షుడు మెరుగు శేకర్, బొడ ఏడుకొండలుతో పాటు మహదేవ్ పూర్, కాటరం మండలల నుండి 200 మంది తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనంతరం ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త సైనికుళ్ల పని చేయాలని ,కాంగ్రెస్ తో నే అన్ని వర్గాలకు న్యాయం మని
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటనని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ,కేంద్రంలో మోడీ ,రాష్ట్రంలో కేసీఆర్ పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని వారు తెలిపారు.