సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ


మహబూబాబాద్/ఇల్లందు/ బయ్యారం.21 వి. కపిల్ కుమార్ స్టాప్ రిపోర్టర్ : మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండల పరిధిలోని గంధంపల్లి గ్రామంలో కల్లు గీత కార్మిక సంఘం, కొత పేట,దుబ్బగూడెం,గంధంపల్లి (గౌడ కులస్తుల) ఆధ్వర్యంలో గౌడ జాతి ముద్దు బిడ్డ, బహుజన హక్కుల పోరాట యోధులు శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ లో అంగోత్ బిందు చైర్ పర్సన్ పాల్గొని మాట్లాడుతూ..

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సంధర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గౌడకులస్తులు, గీత కార్మికుల సమస్యలను ఈ జిల్లా మంత్రి శ్రీ సత్యవతీ రాథోడ్ సహకారాలతో పరిష్కరించేలా కృషి చేస్తానని, మనం అందరం కూడా స్వాతంత్ర్య సమర యోధులు భీమ్ రావ్ అంబేద్కర్ , కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు మొదలైన వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. అలాగే ఇక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గౌడ, గీత కార్మికుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యురాలు శ్ బానోత్ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్, గౌడ సంఘం నాయకులు వెంకటేశ్వర గౌడ్, అమరనేని వెంకన్న గౌడ్, బొడపట్ల వెంకన్న గౌడ్, రాగుల సిద్ధరాములు గౌడ్ ,వైస్ ఎంపిపి తాత గణేష్, గౌడ కులస్తులు పాల్గొన్నారు.