- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, బికే ఎం యు సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం

మహా వెలుగు న్యూస్ రిపోర్టర్ చల్ల వేణు కురవి/ఏప్రిల్ 21 : కురవి మండల కేంద్రంలో ఉపాధి హామీని బిజెపి ప్రభుత్వం తీసివేయాలని కుట్ర చేస్తుందని కాబట్టి ఉపాధిహామీ రక్షించాలని ఉపాధి కూలి రోజుకి 500 రూపాయలు ఇవ్వాలని ఉపాధి హామీ నిధులు భారీగా పెంచాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మరియు బి కే ఎం యు సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కట్ల కృష్ణయ్య గంధసిరి పద్మ రవి మాట్లాడుతూ పైన పేర్కొన్న డిమాండ్లను అమలు చేయాలని కోరారు. అనంతరం ఎంపీడీవో , ఏపీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇస్లావత్ ఆ చ్చాలి, సాల్ కి, బత్తిని వీరభద్రం ,బానోతు శ్రీను, రవి , తదితరులు పాల్గొన్నారు.
