సోషల్ మీడియాలో పరిచయం స్నేహం… న్యూడ్ వీడియోలతో బెదిరించి అత్యాచారం….

మహా వెలుగు హైదరాబాద్ : రాజస్థాన్లో ఓ వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.

27 ఏళ్ల బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. 8 …ఏళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. ఐదు నెలల క్రితం ఓ యువకుడితో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి రోజూ వీడియో కాల్స్ చేసుకొనేవారు. ఈ క్రమంలోనే ఆమె ఆశ్లీల దృశ్యాలను రికార్డు చేశాడు. గతేడాది డిసెంబర్లో ఆమె ఫోన్ నుంచి మరికొన్ని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సేకరించాడు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పి బెదిరించాడు. తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత అతని స్నేహితుడి ఇంట్లో బంధించగా, స్నేహితుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె కనిపించడం లేదన్న కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోని దిగి ఆచూకీ గుర్తించారు. సోషల్ మీడియాకు బానిసై అయిన కొంత మంది యువతి యువకులు ,పెండ్లి అయిన వారు సైతం ఇలానే వేరే వ్యక్తిని కోరుకుంటున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.