వీరారం శివారు వాల్య తాండలో విషాదం , చెరువులో ఈతకు వెళ్లి బాలుడు మృతి

మహావెలుగు మరిపెడ/ ఏప్రిల్/23 రిపోర్టర్ చల్ల వేణు: మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని వీరారం శివారు వాల్య తండాలో విషాదం చోటుచేసుకుంది. బానోత్ లక్పతి సుజాత ల కుమారుడు రేవంత్ వయ్యసు (10) చెరువులో ఈతకు వెళ్లిగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శుక్రవారం నుండి బడికి వేసవి సెలవులు కావడంతో తన ప్రెండ్స్ తో కలిసి సరదాగా ఈత కోసం చెరువులోకి దిగగా ఈత రాకపోవడంతో చెరువులో మునిగి మృతి చెందాడు. దీనితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి