వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 23 : టి .ఎస్ .ఆర్ .టి. సి మహబూబాబాద్ డిపో 1989లో ప్రారంభమై నేటి వరకు ఈ ప్రాంత గ్రామీణ మరియు విద్యార్థులకు ,ఉద్యోగులకు ,అన్ని రకాల ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తూ 70 బస్సులతో వుంది.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ప్రయాణికులకు మరింత సేవలు అందించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, డీలక్స్ మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులను హైదరాబాద్ , నిజాంబాద్ , మంచిర్యాల వేములవాడ లాంటి సుదూర ప్రాంతాలకు బస్సులు నడుపుతూ ఈ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యం కల్పిస్తూ విద్యార్థులకు,ఉద్యోగులకు ,జర్నలిస్టులకు, వికలాంగులకు రాయితీలు కూడా అందిస్తూ ప్రయాణికులకు సేవ చేయడం జరిగింది. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపోను సాటిలైట్ డిపోగా(20 బస్సులు మాత్రమే నడిపే డిపో గా) మార్చాలనే ఉద్దేశంతో బస్ సర్వీసులను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర డిపోలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందులో భాగంగా గత నెలలో ఒక సూపర్ లగ్జరీ, రెండు డీలక్స్ బస్సులను హన్మకొండ, తొర్రూరు డిపోలకు ట్రాన్స్ఫర్ చేశారు .ఈ నెలలో మరో మూడు హైదరాబాద్ నడిచే ఎక్స్ప్రెస్ బస్సు లను కూడా భూపాలపల్లి డిపో కు బదిలీ చేశారు. ఇప్పటికే ఉన్న 70 బస్సులలో 6 బస్సులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో ముప్పై రెండు బస్సులు అద్దె బస్సులు.ఇది జిల్లాలో ఉన్నటు వంటి పెద్ద బస్సు డిపో, దీనిని తగ్గించడం సబబు కాదంటూ ఇంకా ఆర్డినరీ సర్వీసులను కూడా పంపుతారని వార్త తెలిసిన మూలంగా ఈ రోజు మహబూబాబాద్ డిపో కార్మికులు అందరూ కలిసి గత 30 సంవత్సరాలుగా పని చేస్తూ ఇక్కడి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా డిపోను ఉంచాలని కోరుతూ కార్మికులు అందరూ సంతకాల సేకరణ చేసి మేనేజ్మెంట్ విన్నవించడం, వినతి పత్రం సమర్పించడం జరిగింది.
వినతి పత్రం రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు , రీజినల్ మేనేజర్ శ్రీదేవి, మహబూబాబాద్ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఇవ్వటం జరిగింది. కార్మికులందరూ ఏకపక్షంగా కష్టపడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి వినతిపత్రం అందజేయడం జరిగింది.
