వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/తొర్రూర్ 23 : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని మడిపల్లి గ్రామంలో గల ముత్యాలమ్మ కుంట నుండి అక్రమంగా నల్లరేగడి మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్న ఇట్టి సమాచారాన్ని అందుకుని కవరేజీ కోసం ఆ ప్రాంతానికి ఇద్దరు జర్నలిస్టులు వెళ్లి కవరేజ్ చేస్తున్న సందర్భంలో ఏర్పుల మహేష్ మరియు ధరావత్ రాజేందర్ లపై స్థానిక పీసీసీ డైరెక్టర్ కేతి రెడ్డి పాపి రెడ్డి,రావుల అనిల్ రెడ్డి,నలమాస సంపత్, గడిల సాయిలు మరియు టాక్టర్ డ్రైవర్లు తదితరులు కలిసి నానా దుర్భాషలు ఆడుతూ, చొక్కా గల్ల పట్టుకొని ,కులం పేరుతో తిడుతూ భౌతికంగా కర్రలు,రాళ్లతో దాడి చేయడం జరిగింది.
ఈ విషయంపై ఆయా జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జర్నలిస్ట్ల పై దాడి చేసినవారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
