మహా వెలుగు హైదరాబాద్24 : రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఇస్లాం మతంలో రంజాన్ నెల కు విశేష ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా ఈ మాసం నిలుస్తున్నది. నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతారు. సూర్యోదయ సమయంలో ‘సహర్’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ఇప్తార్ వర కు మంచి నీళ్లు సైతం తాగకుండా ఉపవాసం చేస్తారు. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే (రంజాన్) ఆవిర్భవించిందని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధల తో జరుపుకుంటారు

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈనెల 29న సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలిపారు. సర్వ మతాల సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోందని సీఎం చెప్పారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు
ముస్లింలు ప్రత్యేకంగా భావించే ఈ రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసం మొదలుకానున్న సందర్భంగా వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 2 నుంచి రంజాన్ మాసం మొదలుకానున్న నేపథ్యంలో నెలవంక మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు గంట ముందే అంటే 4 గంటలకే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈ రంజాన్ మాసం అనగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఇంతకుముందే ఉత్తర్వులు జారీ చేసింది
