- ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు వస్త్రాల పంపిణి
మహావెలుగు కురవి/ఏప్రిల్ 24 రిపోర్టర్ చల్లా వేణు కురవి మండల కేంద్రములో రంజాన్ పర్వదిన సందర్భంగా పేద ముస్లిం సోదరులకు డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ చేతులమీదుగా వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, గూగులోతు రవి నాయక్, మండల అధ్యక్షులు తోట లాలయ్య, ఆలయ చైర్మన్ బాధవత్ రాము నాయక్ , సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి, గార్లపాటి వెంకట్ రెడ్డి, సర్పంచ్ నూతక్కి పద్మా నరసింహారావు, ఎ౦పిటిసి చిన్నం భాస్కర్, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బెడదవీరన్న, తదితరులు పాల్గొన్నారు.

