మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి

మహా వెలుగు రామగుండం ఏప్రిల్ 24 : గోదావరిఖని ఆదివారం అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. విద్యార్థులు సన్మార్గంలో నడిపించినప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆలోచించాలి మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలన్నారు. వీడ్కోలు సమావేశంలో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.