మహా వెలుగు, హన్మకొండ: తెలంగాణ ,ఆంధ్ర రాష్ట్రాల్లో భర్తలపై భార్యల దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన ‘పుష్ఫ’ ఘటన ప్రజలు మరవకముందే తెలంగాణలో మరో షాకింగ్ ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులైనా కాకముందే దారుణం చేసింది భార్య.
హన్మకొండ జిల్లాలోని దామెర మండలం పసరగొండ గ్రామంలో భార్య అర్చన.. భర్త రాజు గొంతు కోసింది. అయితే, వీరికి మార్చి 25వ తేదీన వివాహం జరగడం విశేషం. ఇటీవల కుటుంబ కలహాలతో భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఇంతలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు స్వల్ప గాయమవడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయానికి చికిత్స చేయించుకోని రాజు తిరిగి ఇంటికి వెళ్లినట్టు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ..
ఇదిలా ఉండగా.. పెళ్లి అయినప్పటి నుంచి అర్చన విచిత్రంగా ప్రవర్తిసోందని ,సైకో గా మారుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు.. ఇటీవలే విశాఖ జిల్లా లో పుష్ప అనే యువతి…….సర్‌ప్రైజ్ అంటూ తనకు కాబోయే భర్తను కళ్లుమూసుకోమని కత్తి తో గొంతుకోసిన విషయం తెలిసిందే దీనితో ఆయన ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఇలా భార్యలు భర్తల ను పైశాచికంగా పిడుస్తున్నారు.

