కేసీఆర్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కలిశాడు : రేవంత్

మహా వెలుగు ,హైదరాబాద్‌ 25 : కేసీఆర్ తో తెగదెంపులు చేసుకునేందుకే కేసీఆర్ ని పీకే కలిశారని , టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ కేసీఆర్‌ను కలిశారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీపై సోమవారం మీడియతో రేవంత్ మాట్లాడుతూ.. ఇక ప్రశాంత్ కిషోర్‌కు టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. ఐప్యాక్‌కు కూడా పీకేకు ఇక ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. తాను ముందు నుంచి అదే చెప్తున్ననాను రేవంత్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని పేర్కొన్నారు.

పీకే కాంగ్రెస్‌లో పార్టీ లో చేరాక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి.. తనతో కలిసి ప్రెస్‌మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్‌ను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారని పేర్కొన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటారని , అధిష్టానం ఏమి చెప్తే అదే చేయాలసి ఉంటుందని తెలిపారు.