జిల్లాస్థాయి వికలాంగుల కమిటీని ప్రభుత్వము, తక్షణమే సత్వరమే నియమించాలి.

  • వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా డిమాండ్.

మహావెలుగు మహబూబాబాద్ /25/ ఏప్రిల్ : జిల్లాస్థాయి వికలాంగుల కమిటీని ప్రభుత్వము, తక్షణమే సత్వరమే నియమించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా డిమాండ్ చేశారు.

కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ ఆఫీసులో జాయింట్ కలెక్టర్ డేవిడ్ వినతి పత్రం ను అందజేశారు. సయ్యద్ ఖాజా మాట్లాడుతూ……ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల దామాషా పద్ధతిలో వ్యక్తిగత రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగ నియామకాల్లో 4‌ శాతం, రిజర్వేషన్లను,57 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని , ప్రభుత్వం ఇంటి స్థలం లేని వికలాంగులకు, ఇంటి స్థలము కొనిచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని అంత్యోదయ కార్డులు, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నారు. బ్లాక్ లాక్ పోస్టులను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలన్నారు.

ప్రతి మండలంలో వికలాంగుల కమిటీ హాల్ నియమించాలని రాష్ట్రా ప్రభుత్వము కొత్త పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలని ముఖ్యంగా ప్రభుత్వము వికలాంగుల బంధు నియమించాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పనిలో ఉపాధి కల్పించాలని , జాతీయ ఉపాధి హామీ జాబ్ కార్డులు లేని వారికి తక్షణమే ఇవ్వాలి. ట్రై సైకిల్, మోటార్ వెహికల్స్, వీల్ చైర్స్, మిషన్ లాంటివి రాని వారికి వికలాంగులకు ఇవ్వాలని తెలిపారు.

సదరం సర్టిఫికెట్ క్యాంపులు నిర్వహించి హార్ట్ పేషెంట్లకు అందరికీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. సదరం సర్టిఫికెట్ మీసేవ సైట్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు పొడిగించి. అన్ని రకాల పేషెంట్లను 1 నుంచి 5 తేదీ వరకు తక్షణమే అందేలా చూడాలన్నారు. వికలాంగుల వైకల్య రకాలు 7 రకాలు వాటికి సర్టిఫికెట్ ఇచ్చేది. 2016 నూతన చట్టాల ప్రకారం 21 రకాల వైకల్యాలకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు.

వికలాంగులకు కొత్త పింఛన్లు ప్రభుత్వం 3 సంవత్సరాలు అయినా నేటికీ ఇవ్వ లేదన్నారు. తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి వికలాంగుల కుటుంబానికి బ్యాంకులో ఏ షరతులు లేకుండా వ్యక్తిగత రుణాలు రూ. 5 లక్షల తక్షణమే ఇవ్వాలని అన్నారు. 2016 నూతన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం ప్రశాంత్, మడ్డూరి నాగభూషణం, బాలకృష్ణ, కే. ఉమేష్, ఆర్ సారయ్య, నీలం నరేష్,లలిత, కె. కమలమ్మ, బత్తిని వెంకన్న, బేగావత్ రవి, కే సుశీల, సరిత, కే మల్లేష్, కొండబత్తుల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.