అడవి గ్రామాల అభివృద్ది కి సహకరించాలి : ఎమ్మెల్యే సీతక్క

  • కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి ని కలిసి ములుగు నియోజక వర్గ సమస్యలు వివరించి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

మహా వెలుగు హైదరాబాద్ 25 : అడవి గ్రామాల అభివృద్ది కి సహకరించాలని , ములుగు నియోజకవర్గo లో ఉన్న సమస్యలను తీర్చాలని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.

సోమవారం చెల్పుర్ జెనుకో గెస్ట్ హౌస్ లో జరిగిన ‘నీతి అయోగ్’ సమావేశానికి హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరు కాగ ,ములుగు నియోజక వర్గ సమస్యలు వివరించి వినతి పత్రం ను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ….
ములుగు ట్రైబల్ యూనివర్సిటీ పనులు ప్రారంభిoచాని ఈ విద్యాసంవత్సరం నుండి తరగతులు ప్రారంభిమాచాలని 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పొడుభూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు మరియు అక్రమ కేసులు పెట్టి బయబ్రతులకు గురి చేస్తున్నారని

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఫారెస్ట్ అధికారులకు ఇచ్చే కంపా నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని , అడవి గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి దీని ద్వారా అడివి గ్రామాలలో రోడ్లు, వ్యవసాయానికి 3 ఫెజ్ కరెంట్ ఇవ్వాలని , గిరి వికాస బోర్లకు పర్మిషన్ ఉన్న ఫారెస్ట్ అధికారుల అడ్డంకులను అపి గిరి వికాస బోర్లకు పర్మిషన్ ఇవ్వాలని
అడవి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఆదిలాబాద్ తరహాలో ఇప్పపువ్వు లడ్డు తయారి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
ములుగు నియోజకవర్గం లో అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను పెంచాలి అని కోరుతూ లేఖను అందజేశారు.