తెలంగాణ‌లో పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

మహా వెలుగు ,హైద‌రాబాద్ 26 : తెలంగాణ‌లోని ఉద్యోగార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,027 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మే 2 నుంచి మే 20 వరకు http://WWW.tslprb.in/సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.