వేముల‌వాడ ఆల‌యంలో నాగుపాము ప్ర‌త్య‌క్షం

మహా వెలుగు , వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు.

చిన్న పెట్టుబడులు పబ్లిసిటీ ఎక్కువ యాడ్స్ కోసం 8179394919

విషయం తెలుసుకున్న దేవస్థానం అవుట్ సోర్సింగ్ సిబ్బంది లక్ష్మణ్ నాగుపామును పట్టుకుని, పట్టణ శివారులోని ఖాళీ ప్రదేశంలో వదిలేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శివాలయంలో నాగుపాము కనిపించడంతో కొందరు దూరం నుండి దండం పెట్టుకోగా, కొందరు భయంతో పరుగులు తీశారు.