మహా వెలుగు , కురవి /ఏప్రిల్ 26 రిపోర్టర్ చల్ల వేణు : మహబూబాద్ జిల్లా కురవి మండల చింతపల్లి గ్రామంలోని ధీరావత్ తండా చెందిన రైతు బాదావత్ వీరభద్రం (తండ్రి) రాంసింగ్ ఇటీవల కాలంలో పురుగులు మందు తాగి చనిపోయారు. తెలంగాణ ప్రభత్వం అందిస్తున్న రైతు భీమా పధకం సహాయార్ధం కొరకు మండల అగ్రికల్చరల్ విస్తిరణఅధికారి కళ్యాణ్ వారి కుటుంబాన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రైతుకు ప్రభుత్వం నుండి కొద్ది రోజులలో రైతు బీమా పథకం ద్వారా 5 లక్షలు కుటుంబ నామినీ బాదవత్ బుల్లి బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయని అగ్రికల్చర్ విస్తీర్ణ అధికారి కళ్యాణ్ తెలిపారు. బాధితునికి ఎకరం భూమి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అధికారి వెంట మండల వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య మాజీ ఎంపిటిసి హాత్తి రామ్ తదితరులు ఉన్నారు.

