- నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.
వి. కపిల్ కుమార్,మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ ,మహబూబాబాద్, ఏప్రిల్ -26: మహబూబాబాద్
జిల్లా కలెక్టర్ కె. శశాంక మంగళవారం నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

ముందుగా నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ… పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, భవనం ఎదురుగా ప్లాస్టింగ్ పనులు, విద్యుత్ పనులు, సీలింగ్ పనులు,ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె. శశాంక కలెక్టరేట్ నూతన కార్యాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించి, నర్సింగ్ కళాశాల, కలెక్టరేట్ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో భవనం ఆవరణలో సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కొమురయ్య, ఆర్ అండ్ బి – ఎస్.ఈ. నాగేందర్, ఈ.ఈ. తానేశ్వర్, ఏ. ఈ., డి.ఈ.సి. కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ సంపూర్ణ రావు, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.
